కర్ణాటక రాష్ట్రం బీదర్ లోని ఇరానీ గల్లి నుంచి హైదరాబాద్ కు అక్రమంగా ఎండు గంజాయిని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో మునిపల్లి ఎస్ఐ రాజేశ్ నాయక్ తన సిబ్బందితో కలిసి కంకల్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో భాగంగా ఓ స్కూటీపై అనుమానం వచ్చి ఆపి పరిశీలించారు. అందులో 500 గ్రాముల గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa