AP: పెళ్లి చేసుకుంటానని తమ కుమార్తెను వంచించి వేరే వ్యక్తితో సంబంధం ఉందంటూ యశ్వంత్ చంపేశాడని శ్రీకాకుళం జిల్లా కొత్తూరుకు చెందిన మృతురాలు కావ్యశ్రీ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. కావ్యశ్రీ, యశ్వంత్ మూడేళ్లుగా ప్రేమించుకున్నారని, ఈ నెల 2న ఇంట్లో ఎవరూ లేని సమయంలో చంపేశాడని తెలిపారు. కావ్యశ్రీకి హైదరాబాద్‌లో ఉద్యోగం రావడంతో యశ్వంతే పంపాడని, అక్కడికి వెళ్లినప్పుడు అనుమానం పెంచుకుని వేధించేవాడన్నారు. యశ్వంత్‌ను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa