నైరుతి రుతుపవనాల విస్తరణ కారణంగా తెలంగాణ వ్యాప్తంగా కొద్ది రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇవాళ సైతం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa