ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి గ్రామంలోని అటవీ ప్రాంతంలో ఉన్న జానకీబాయి చెరువు పూర్తి స్థాయిలో నిండి శనివారం మధ్యా హ్నం నుంచి అలుగు పొంగి పొర్లుతోంది. జలపాతాన్ని తలపించేలా ఎత్తు నుంచి నీరు పడుతుండటంతో ఈ అలుగును చూసేందుకు సందర్శకుల తాకిడి పెరిగింది. ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది. వర్షాలు పడుతుండటం చెరువుకి చేరుకోవడానికి ఉన్న దారి కూడా బురదగా మారడం, అక్కడకి వెళ్లే సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa