షెటిల్ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలానికి చెందిన గుండ్ల రాకేష్ (25) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఎలక్ట్రిక్ కార్ల షోరూమ్‌లో పని చేస్తున్నాడు. అతనికి రోజూ షెటిల్ ఆడే అలవాటు ఉంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి నాగోల్ స్టేడియంలో షెటిల్ ఆడుతుండగా రాకేష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa