TG: గిరిజనుల్లో చాలామందికి ఉండటానికి కనీసం ఇళ్లు కూడా లేవని.. కాబట్టి ఇళ్ల నిర్మాణం కోసం బడ్జెట్ నిధులను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ఎస్టీలకు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కనీస స్థల అర్హతను సడలించాలనే డిమాండ్ ఉందని చెప్పారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కోసం చేసే పనులకు బిల్లులను సకాలంలో చెల్లిస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa