తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూ స్ చెప్పనుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒకటైన 'మహాలక్ష్మి స్కీమ్'ను త్వరలో అమలు చేయనుంది. ఈ స్కీంలో భాగంగా 18 ఏళ్లు దాటిన మహిళలందరికీ నెలకు రూ. 2500 ఖాతాల్లో జమ చేయనుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుండటంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే మహాలక్ష్మి స్కీమ్ పై కూడా ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa