పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో గురువారం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బహుజన వీరుడు, ముదిరాజ్ ముద్దుబిడ్డ పండుగ సాయన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో ముదిరాజ్ కుల సంఘాల అధ్యక్షులు తూడి సదయ్య, నాయకులు కలవల తిరుపతి, పెండం సతీష్ లతోపాటు మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa