నంద్యాల జిల్లా బనగాపల్లె నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు మదన భూపాల్ రెడ్డి, ఏఆర్ కానిస్టేబుల్ జస్వంత్‌పై దాడి చేసిన ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. కార్యక్రమంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌తో మదన భూపాల్ రెడ్డికి వాగ్వాదం జరిగింది. ఈ వివాదం తీవ్ర రూపం దాల్చడంతో ఆగ్రహానికి గురైన భూపాల్ రెడ్డి, కానిస్టేబుల్ చెంపపై కొట్టినట్లు సమాచారం.
ఈ ఘటనతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కానిస్టేబుల్‌పై దాడి చేసిన మదన భూపాల్ రెడ్డి కూటమి నాయకుడిగా ఉండటం, అతను మంత్రి సోదరుడు కావడం ఈ ఘటనకు మరింత ప్రాధాన్యతను జోడించింది. స్థానిక పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది, అయితే ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ దాడి ఘటన స్థానికంగా పెద్ద ఎత్తున ఆందోళనలకు దారితీసింది. ప్రభుత్వ అధికారులపై రాజకీయ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడటం సమాజంలో అసహనాన్ని రేకెత్తిస్తోంది. ఈ ఘటనపై తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది, రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారనేది చూడాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa