భార్య హత్య కేసులో భర్తకు కోర్టు జీవిత ఖైదు విధించినట్లు పోలీసు కమీషనర్ అనురాధ గురువారం తెలిపారు. విఠలాపూర్ కు చెందిన గంగసాని శ్రీనివాస్ రెడ్డికి కర్ణాటక రాష్ట్రం రాయిచూర్ కు చెందిన ఇందిరతో కట్నకానుకలు ఇచ్చి వివాహం జరిపించారు. ఈ క్రమంలో 2019 ఏప్రిల్ 10న ఇందిర ఆత్మహత్య చేసుకుందని మృతురాలి సోదరుడికి సమాచారం ఇచ్చారు. నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ రూ. 2వేల జరిమానా విధించినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa