ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ ప్రయోజనాలను కేసీఆర్ విస్మరించారని తీవ్ర విమర్శ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 03, 2025, 07:41 PM

కేసీఆర్ వల్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి, పొరుగు రాష్ట్రానికి లబ్ధి చేకూర్చేలా కేసీఆర్ వ్యవహరించారని ఆయన తీవ్రంగా విమర్శించారు. "గోదావరిలో 3 వేల టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయి, వాటిని ఏపీ వాడుకోవచ్చు" అని గతంలో కేసీఆరే స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణను పక్కనపెట్టి, రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆయన మాటలతోనే ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన జనహిత పాదయాత్రలో భాగంగా జక్రాన్‌పల్లి మండలం అర్గుల్‌ గ్రామంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa