నల్గొండ జిల్లాలోని నార్కెట్పల్లి చౌరస్తా వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. వేగంగా దూసుకొచ్చిన స్విఫ్ట్ కారు, రోడ్డు దాటుతున్న ఓ మహిళను ఢీకొట్టి పరారైన ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది.
పట్టణానికి చెందిన కిరాణా వ్యాపారి అర్ధం సత్యనారాయణ భార్య కృష్ణవేణి, తమ షాపు ఎదుట రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారు వేగంగా వచ్చి ఆమెను వేగంగా ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ దృశ్యం చూసిన స్థానికులు తక్షణమే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో కారు డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడిపినట్టు భావిస్తున్నారు. క్షణాల్లో జరిగిన ఈ ఘటనలో డ్రైవర్ కారుతో సహా ప్రమాద స్థలాన్ని వదిలి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా కారును గుర్తించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్న వారు సాధారణ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టి పెడుతున్నారని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa