హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట పీఎస్ పరిధిలోని ఎల్లమ్మబండలో మంగళవారం దారుణ హత్య జరిగింది. స్థానిక గుడ్ విల్ హోటల్లో ఓ యువకుడు చాయ్ తాగుతుండగా గుర్తు తెలియని దుండగులు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఆటోలో వచ్చి అతడిని కత్తులతో నరికారు. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుల వివరాలు, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి జగద్గిరిగుట్ట పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa