తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిప్రధాన ప్రొ.జయశంకర్ జయంతి వేడుక ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి పాల్గొని ప్రొ.జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం నిరంతరం తపించిన స్వాప్నికుడు ప్రొ.జయశంకర్ అని ఆయన కొనియాడారు.ఈ కార్యక్రమంలో జలమండలి ఈఎన్సీ, డైరెక్టర్ ఆపరేషన్స్- 2 ప్రవీణ్ కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్, ఫైనాన్స్ డైరెక్టర్ పద్మావతి, పర్సనల్ డైరెక్టర్ మహ్మద్ అబ్దుల్ ఖాదర్, సీజీఎంలు, జీఎంలు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa