తెలంగాణలో 'మహాలక్ష్మి' స్కీమ్ కింద మహిళలకు ప్రతి నెలా రూ.2,500లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పోస్టాఫీసులో ఖాతా ఉన్న వారికి ఈ స్కీమ్ ఇస్తారనే వదంతులు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోస్టాఫీసు వద్ద మహిళలు బుధవారం పెద్ద ఎత్తున బారులు తీరారు. దీంతో తోపులాట జరిగింది. ఎవరో వదంతులు సృష్టించడం వల్ల ఇలా జరిగినట్లు పోస్టల్ శాఖ అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa