ఐర్లాండ్‌లో భారత సంతతికి చెందిన 6 ఏళ్ల బాలికపై జాత్యంహకార దాడి జరిగింది. వాటర్‌ఫోర్డ్ నగరంలో ఆగస్టు 4న, ఇంటి బయట ఆడుకుంటున్న 6 ఏళ్ల బాలికపై 12-14 ఏళ్ల వయసున్న కొందరు బాలురు దాడి చేశారు. ముఖంపై కొట్టడంతో పాటు వ్యక్తిగత అవయవాలపై దాడి చేసి గాయపరిచారు. డర్టీ ఇండియన్.. గో బ్యాక్ టూ ఇండియా అంటూ వాళ్లు అసభ్య పదజాలం ప్రయోగిస్తూ ఆ బాలికను వారించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa