మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లను తీసివేస్తే తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో తాను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ల అంశాన్ని తొలగిస్తే, తాను స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలతో మాట్లాడతానని కిషన్ రెడ్డి చెప్పారు. బీసీ రిజర్వేషన్లతో ముస్లింలను ఎలా ముడిపెడతారని ప్రశ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరాలోచించుకోవాలని సూచించారు. అసదుద్దీన్ ఒవైసీ, అజారుద్దీన్, షబ్బీర్ అలీ వంటి వారు బీసీలు ఎలా అవుతారని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa