కొల్లాపూర్ నియోజకవర్గంలో బీసీ రిజర్వేషన్ పితామహుడు, బీహార్ మాజీ సీఎం బి.పి. మండల్ 40 ప్రతిపాదనలతో కూడిన మండల్ కమిషన్ నివేదికను 1979లో ప్రవేశపెట్టారు. 1990 ఆగస్టు 7న మండల్ కమిషన్ సిఫార్సులలో భాగంగా బీసీలకు 27% రిజర్వేషన్ పార్లమెంట్ ఆమోదం పొందింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం మండల్ కమిషన్ సిఫార్సులను పూర్తిస్థాయిలో ఆమోదించాలని, దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు అప్పల మాసయ్య యాదవ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లను పూర్తిస్థాయిలో ఆమోదించాలని కూడా కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa