తెలంగాణలో వాయిదాపడుతున్న స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సెప్టెంబర్ చివరిలోగా సర్పంచ్, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై నిరసనల మధ్య ఈ ప్రకటన చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్, బీజేపీ-బీఆర్‌ఎస్ కలిసి బీసీ రిజర్వేషన్లకు అడ్డు పెడుతున్నాయని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa