కుత్బుల్లాపూర్‌లోని గాజులరామారం చౌరస్తాలో తెలంగాణ ప్రజా పోరాట వీరుడు, బహుజన వర్గాల ఐక్యతకు, సామాజిక న్యాయానికి కృషి చేసిన పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. తెలంగాణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు దొంతుల రమేష్ ముదిరాజ్, ఎం. సుగ్రీవుడు ముదిరాజ్, పాండురంగ ముదిరాజ్, విష్ణు ముదిరాజ్, సాయి ముదిరాజ్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa