హైదరాబాద్‌లో గత నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి కూడా భారీ వర్షం కురవడంతో నగరం తడిసిముద్దైంది. తెలంగాణ వెదర్‌మ్యాన్ ప్రకారం, సోమవారం మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉండి, మధ్యాహ్నం 2 గంటల తర్వాత మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ వర్షం అర్ధరాత్రి వరకు కొనసాగి, పలు ప్రాంతాల్లో 25-55 మి.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa