కాంగ్రెస్ ఆరు గ్యారంటీల హామీ ఆర్థిక రంగానికి నష్టం చేసిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కాగ్ త్రైమాసిక నివేదిక ప్రకారం రూ.10,583 కోట్ల రెవెన్యూ లోటు వచ్చిందన్నారు. "రాష్ట్ర ఆదాయం తగ్గుతుంటే.. అప్పులు పెరుగుతున్నాయి. 3 నెలల్లో రూ.20,266 కోట్లు అప్పు చేశారు. ఒక్క రోడ్డు వేయలేదు. ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలేదు. ఆర్థిక రంగాన్ని ఎలా గాడిన పెడతారో చెప్పగలరా?" అని కేటీఆర్ 'ఎక్స్' వేదికగా ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa