మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం బుద్దారం గ్రామంలో రైతు నాయిని దశరథం గౌడ్ తన వ్యవసాయ పొలంలో వరి నాట్లు వేయడానికి పొలం చదును చేస్తుండగా, గట్టుపై రక్త పింజర కనిపించింది. వెంటనే ఆ పాము ఒక చెక్క మొద్దు క్రిందికి వెళ్లిపోయింది. స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించగా, అతను వచ్చి పామును పట్టుకొని తీసుకెళ్లారు. దీంతో పశువుల కాపరులు, చుట్టుపక్కల రైతులు పామును పట్టుకున్న వ్యక్తికి కృతజ్ఞతలు తెలిపారు. రైతు అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa