జగిత్యాల జిల్లా వాస్తవ్యులు ముస్కు కార్తీక్ రెడ్డి – సుష్మ దంపతులు, తమ పిల్లలైన ఆరుష, కియాన్ పేర్లతో మంగళవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం, ఆలయంలో భక్తులకు నిత్యం ఉచిత అన్నదానం నిర్వహించే నిత్యాన్నదాన ట్రస్టుకు రూ. 5,00,116 విరాళాన్ని అందజేశారు. ఈ చెక్కును ఆలయ ఈఓ రాధాబాయికి అధికారికంగా అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రోటోకాల్ ఏఈఓ జి. అశోక్ కుమార్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa