జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర సత్యం 30వ వర్థంతి సందర్భంగా, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎర్ర సత్యం చౌరస్తాలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎర్ర సత్యం పేదల అభ్యున్నతికి, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి చివరి క్షణం వరకు విశేషంగా కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa