రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో CM రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు మీటింగ్ జరుగనుంది. పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా రాబోయే ఐదారు రోజుల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచన చేసింది. పలు జిల్లాలకు ఇప్పటికే ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం సూచించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa