TG: భారీ వర్షాల నేపథ్యంలో రేపు మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్లకు పూర్తిగా సెలవు ఇస్తున్నట్లు DEO ప్రకటించారు. ప్రభుత్వ, ZP, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లు ఈ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. కాగా తొలుత హాఫ్ డే సెలవు ఇవ్వగా, తాజాగా పూర్తిగా సెలవును ప్రకటించారు. అటు జగిత్యాల, హనుమకొండ, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్ జిల్లాల్లోని స్కూళ్లకు కూడా రేపు సెలవు ఉండనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa