దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలంలోని దివిటీపల్లి వద్ద అమరాజా కంపెనీకి వెళ్లే రహదారి భారీ వర్షాలకు కోతకు గురికావడంతో, కంపెనీకి చెందిన మినీ బస్సు గురువారం అందులో పడిపోయింది. ఈ ఘటనలో అమరాజా సిబ్బంది గాయపడ్డారు. జాతీయ రహదారి 44పైకి కూడా వరదనీరు చేరుతుండటంతో పెను ప్రమాదం పొంచి ఉంది. దివిటిపల్లి వద్ద రహదారిపై నుండి వరదనీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జాతీయ రహదారి కూడా కోతకు గురయ్యే అవకాశాలున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa