TG: రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తున్న కుటుంబాలకు జీరో బిల్లు వర్తింపజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద నెలకు రూ.200 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతోంది. దీంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గించి, భారం తగ్గించుకునే యోచనలో సర్కారు కనిపిస్తోంది. ఒక్కసారైనా ఇంట్లో 200 యూనిట్లు కంటే అధికంగా విద్యుత్ వినియోగిస్తే ఈ పథకానికి అనర్హులుగా పరిగణించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa