వనపర్తి జిల్లా మదనాపురం మండలంలో ఉన్న సరళాసాగర్ ప్రాజెక్టులో ఆటోమెటిక్ సైఫన్ గేట్లు సోమవారం ఐదు స్వయంగా తెరచుకున్నాయి. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాల వల్ల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో, ఈ ఐదు గేట్ల ద్వారా సుమారు 6 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ఈ నీటి ప్రవాహం కారణంగా ఆత్మకూర్–వనపర్తి రహదారిపై ఉన్న కాజ్‌వేలు మునిగిపోయాయి. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ పరిస్థితి ఇప్పటికే ఐదు రోజులుగా కొనసాగుతున్నది, ప్రయాణికులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు.ఇక రామన్‌పాడు ప్రాజెక్టులో మూడు గేట్లు ఎత్తివేసి, దాదాపు 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ ప్రమోద్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa