TG: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆహ్వానం అందింది. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆయనను హర్యానా మాజీ గవర్నర్, మాజీ MP బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. HYD-నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అక్టోబర్ 3న ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే ఆలయ్ బలయ్‌కు హాజరవ్వాలని ఆహ్వానించారు. ప్రేమ, ఆప్యాయత, సోదరభావాన్ని చాటే ఈ ప్రత్యేక సాంస్కృతిక సమ్మేళనం ఎంతో గొప్పదని మహేశ్ కొనియాడారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa