శంషాబాద్ ఎయిర్‌పోర్టు రహదారిలో మంగళవారం ఉదయం రెండు కార్లు వెనుక నుంచి ఢీకొనడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో టయోటా, ఐ20 కార్లు బోల్తా పడి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ సంఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ అవుట్‌పోస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా రహదారిపై వాహనాలు స్తంభించిపోయాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa