గుడిహత్నూర్ మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ టీ షర్ట్లను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నేరడిగొండలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యువత సామాజిక సేవలో ముందుండాలని ఎమ్మెల్యే సూచించారు. తన తల్లి జ్ఞాపకార్థం సొసైటీని స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సత్యరాజ్ ఉపారపును ఎమ్మెల్యే అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa