జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే తుమ్మల, పొన్నం, వివేక్‌లకు ఉప ఎన్నిక బాధ్యతలు అప్పగించింది. మంత్రులతో పాటు 18 మంది కార్పొరేషన్ చైర్మన్‌లకు కూడా ఈ బాధ్యతలను అప్పగించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి పర్యటించాలని, బూత్‌లలో సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. బూత్‌వారీగా ఓటర్ మ్యాపింగ్ పూర్తయింది. అయితే, అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్‌లో ఇంకా మల్లగుల్లాలు కొనసాగుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa