మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రెండున్నర నెలలుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న చిరుత పులి ఎట్టకేలకు అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. తిరుమల దేవుని గుట్ట, వీరన్న పేట ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేసిన ఈ చిరుత, ఇళ్ల సమీపంలోకి కూడా రావడంతో ఆందోళనలు పెరిగాయి. డ్రోన్ నిఘా కూడా విఫలమైన నేపథ్యంలో, అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కడంతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa