బేగంపేట విమానాశ్రయంలో బుధవారం ప్రయాణికుల సేవా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్ కో-ఆర్డినేషన్ ఇన్‌చార్జి అచింత్ కుమార్‌గత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన, చిన్నారులకు పెయింటింగ్ పోటీలు, విద్యార్థులకు విమానయాన రంగంలో ఉపాధి అవకాశాలపై అవగాహన వంటి వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa