భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారిపై న్యూ డైమెన్షన్ స్కూల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనాజిపురానికి చెందిన బాలయ్య గౌడ్ అనే కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. అతివేగంతో వచ్చిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి లూనాను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa