పుల్కల్ మండలం సింగూర్ డ్యాంలో శనివారం ఉదయం 55,764 క్యూసెక్కుల భారీ వరద చేరుతున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ స్టాలిన్ తెలిపారు. డ్యాం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 17.149 టీఎంసీల నీటిమట్టం ఉందని పేర్కొన్నారు. దీంతో 7 గేట్లను తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం 56,528 క్యూసెక్కుల నీటిని బయటకు వదిలినట్లు అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa