నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో ఘటన.గోవిందపల్లి వాగు వద్ద రూపనగుడి చెరువు ఉధృతం కావడంతో రహదారిపైకి చేరిన నీరు. భారీ వరద నీటిలో చిక్కుకుపోయిన ఆ మార్గంలో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రోక్లైన్లు, రోప్ సహాయంతో వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన గ్రామస్థులు. సుంకేసుల డ్యామ్ నుంచి నీరు అధికంగా విడుదల కావడంతో ఉయ్యాలవాడ-జమ్మలమడుగు రహదారి పూర్తిగా బంద్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa