TG: ఖమ్మం జిల్లా ఆరెంపులలో అపశృతి చోటు చేసుకుంది. మంత్రి పొంగులేటికి పెను ప్రమాదం తప్పింది. ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో కార్యక్రమంలో అకస్మాత్తుగా బాణాసంచా పేలి కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఓ చిన్నారి స్పృహ కోల్పోయింది. కార్యక్రమంలోనే ఉన్న మంత్రికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa