హైదరాబాద్‌లోని తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌గా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రతిపాదనపై జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో చర్చించారు. భవిష్యత్‌లో ఫ్లైఓవర్‌పై ఉన్న అన్ని సైన్ బోర్డులు, మ్యాప్‌లు, అధికారిక డాక్యుమెంట్లలో కొత్త పేరును ప్రతిబింబించే విధంగా మార్పులు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం రాష్ట్ర గుర్తింపును, స్థానిక చరిత్రను ప్రతిబింబించే ప్రయత్నంగా తీసుకున్నట్టు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa