ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేడ్చల్ లో కొత్త వైన్ షాపుల రిజర్వేషన్ డ్రా పూర్తి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 26, 2025, 11:53 AM

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 2025-27 కొత్త వైన్ షాపుల టెండర్లకు సంబంధించిన రిజర్వేషన్ల డ్రాను కలెక్టర్ మను చౌదరి సమక్షంలో పూర్తి చేశారు. మేడ్చల్ ఎక్సైజ్ యూనిట్ పరిధిలో 118 దుకాణాల్లో ఓపెన్ కేటగిరీకి 101, గౌడకు 11, ఎస్సీకి 5, ఎస్టీకి 1 కేటాయించారు. మల్కాజిగిరి యూనిట్ లో 88 దుకాణాల్లో ఓపెన్ 68, గౌడ 12, ఎస్సీ 7, ఎస్టీ 1 గా రిజర్వు చేశారు. శుక్రవారం  నుండి దరఖాస్తులు స్వీకరించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa