గోషామహల్‌లో సొంత ఇల్లు లేదన్న మనోవేదనతో జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న రాకేశ్ (36) శుక్రవారం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళ్‌హాట్ ప్రాంతానికి చెందిన రాకేశ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గోడేఖీఖబర్‌లోని డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో ఈ ఘటన జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆసుపత్రికి తరలించేలోపే అతను మృతి చెందినట్లు తెలిపారు. భార్య లావణ్య ఫిర్యాదుతో గోషామహల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa