తెలంగాణలో వర్షాల తాకిడి నుంచి కోలుకోకముందే వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ మొదటి వారంలో, ముఖ్యంగా అక్టోబర్ 1 లేదా 2 నాటికి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దీనివల్ల రాష్ట్రంలో విస్తృతంగా, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1 మధ్య తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్టోబర్ 2 నుంచి 4 మధ్య వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa