ఆసియా కప్ లో అద్భుత ప్రదర్శనతో భారత్ ను గెలిపించిన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ, మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం రేవంత్, తిలక్ వర్మను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా తిలక్ వర్మ సీఎంకు క్రికెట్ బ్యాట్ ను బహూకరించారు. ఆదివారం జరిగిన ఫైనల్ లో తిలక్ వర్మ 53 బంతుల్లో 69 పరుగులు చేసి, సంజూ శాంసన్, శివం దూబేలతో కలిసి జట్టుకు విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa