ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైలార్‌దేవ్‌పల్లిలో దుర్గామాత మహా చండి అలంకరణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 30, 2025, 08:01 PM

దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లోని బృందావన్ కాలనీ, సాయిబాబా నగర్‌తో పాటు పలు కాలనీలలో దుర్గామాత ఆలయంలో 9వ రోజు శ్రీ దుర్గాదేవి మహా చండి అలంకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా చండీ హోమం, అన్నప్రసాదం కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa