ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజాసింగ్ పై శాలిబండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 06, 2025, 04:39 PM

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయనపై హైదరాబాద్‌లోని శాలిబండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కొన్ని రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లో ఆయన చేసిన ప్రసంగంపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.వివరాల్లోకి వెళితే, ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రాజాసింగ్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన ఒక వర్గాన్ని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాపించింది.ఈ వీడియోను చూసిన హైదరాబాద్ ఫతే దర్వాజ ప్రాంతానికి చెందిన కొందరు యువకులు.. రాజాసింగ్ వ్యాఖ్యలు తమ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఆరోపిస్తూ శాలిబండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు చేసినట్లు సోమవారం వెల్లడించారు. ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa