TG: 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు బంద్ చేపట్టాయి. దిల్‌సుఖ్ నగర్‌లో బీసీ ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొని ఆర్టీసీ బస్ డిపోల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. పలు ప్రైవేటు బస్సులను కూడా అడ్డుకోవడంతో పోలీసులు వారిని ఆపేందుకు ప్రయత్నించారు. పోలీసులు, బీసీ నేతల మధ్య వాగ్వాదం తలెత్తి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa