ప్రభుత్వ కార్యాలయాల్లో అక్రమాలను అరికట్టేందుకు, సమగ్ర సమాచారం కోసం ఉద్యోగులు తమ ఆధార్, ఫోన్ నంబర్లను ఆన్లైన్ పోర్టల్లో ఈనెల 10లోపు నమోదు చేసుకోవాలని ఆర్థిక శాఖ హెచ్చరించింది. ఈ గడువులోగా వివరాలు నమోదు చేయని ఉద్యోగులకు జీతాలు నిలిపివేస్తామని స్పష్టం చేసింది. ఇప్పటివరకు 5.21 లక్షల రెగ్యులర్ ఉద్యోగుల్లో 2.22 లక్షల మంది, 4.93 లక్షల ఒప్పంద సిబ్బందిలో 2.74 లక్షల మంది మాత్రమే వివరాలు అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa