సంగారెడ్డి పట్టణ శివారులోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో గురువారం కృత్తికా నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయ కమిటీ చైర్మన్, పూజారులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారి పల్లకి సేవ కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో మ్యాడం రాధా కిషన్, ఈల్లింతల రాజు, జూలకంటి మల్లేశం, కొంపల్లి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa